మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ఓటర్ల గుర్తింపు ప్రక్రియ

Tue,June 25, 2019 07:50 AM

telangana state government arrangements to municipal and corporation elections

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించాయి. మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల రెండోతేదీతో పాలకవర్గాల గడువు ముగియ నుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన జరగుతోంది. జులై 19 నాటికి గుర్తింపు ప్రక్రియ ముగియనుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగూణంగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ప్రక్రియ కొనసాగుతుంది. గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. 53 మున్సిపాలిటీలు, మూడు కార్పోరేషన్ల పాలక మండళ్ల పదవీ కాలం జులై 2వ తేదీతో ముగియనుంది. ప్రత్యేక అధికారుల నియామకానికి ప్రభుత్వ కసరత్తు చేస్తుంది. అధికారుల నియామకంపై జులై 2న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. 28 రోజుల్లో ఓటరు గుర్తింపు ప్రక్రియ పూర్తి కానుంది. జులై 4వతేదీ లోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించనున్నారు. జులై 5వ తేదీన ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తారు. 6వ తేదీన ముసాయిదా ప్రకటిస్తారు. ముసాయిదాపై జులై 11వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. జులై 16వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేస్తారు. జులై 17వ తేదీన ఓటర్ల జాబితా, 18వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. జులై 19న మున్సిపల్ అధికారికి ఓటర్ల పూర్తి జాబితాను అందజేస్తారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు.

281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles