తిరుమల శ్రీవారిని దర్శించుకున్నపోచారం శ్రీనివాసరెడ్డి...

Tue,May 28, 2019 10:30 AM

telangana speaker pocharam srinivas reddy visit tirumala

తిరుమల శ్రీవారిని రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారికి జరిగే నైవేధ్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామి వారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ సారి ప్రభుత్వం చేపట్టిన సంధర్బంగా స్వామి వారికి మ్రొక్కులు చెల్లించుకొవడానికి తిరుమల వచ్చినట్లు తెలిపారు.రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆదేవదేవున్ని కోరుకున్నట్లు పోచారం పేర్కోన్నారు.

1114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles