ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు: ఇంద్రకరణ్‌రెడ్డి

Tue,March 5, 2019 06:56 PM

Telangana should be plastic free state says minister Indrakaran reddy

హైదరాబాద్: తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అటవీ, పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సదస్సుకు జీవవైవిద్య, ఈపీటీఆర్‌ఐ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలుష్య కారక పరిశ్రమలు, ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. పరిశ్రమలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్లాస్టిక్ బదులు జూట్ సంచులు అందుబాటులోకి తేవాలని సూచించారు. 50 మైక్రాన్లకు తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్ల కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ముంబయి తరహాలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కాలం చెల్లిన వాహనాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. నిరంతరం కాలుష్య ప్రమాణ తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. వాయు కాలుష్యంపై అధ్యయనం చేసి నివేదికలు అందించాలని ఆదేశించారు. రైతులకు ఉపయోగపడేలా బార్క్ టెక్నాలజీతో పరిశోధనలు చేయాలన్నారు. వాతావరణ మార్పులపై ఈపీటీఆర్‌ఐ పరిశోధనలు చేయాలన్నారు. బొటానికల్ గార్డెన్‌లోని నీటి సమస్యకు ప్రత్యామ్నాయం చూడాలన్నారు. అమీన్‌పూర్ చెరువును పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles