అంబేద్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు: సీఎం

Thu,April 14, 2016 02:23 PM

telangana realized because of ambedkar

హైదరాబాద్: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ నగరంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదన్నారు. అంబేద్కర్ తెచ్చిన చట్టంతోనే ఇవాళ తెలంగాణ స్వేచ్చా వాయువులు పీలుస్తోందని పేర్కొన్నారు.

కొత్త రాష్ర్టాలు ఏర్పాటు చేసే అధికారం కేంద్రం దగ్గరే ఉండాలని అంబేద్కర్ రాత్రంతా కూర్చుని ఒక నోటు తయారు చేశారని వివరించారు. రాష్ర్టాలను ఏర్పాటు చేసే అధికారం కేంద్రం దగ్గరే ఉండాలని చట్టం చేయడం వల్లే మనకు తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని తెలిపారు. అంబేద్కర్ దయవల్లే మనం దోపిడి నుంచి విముక్తి పొందామన్నారు. అంబేద్కర్‌కు ఎంత గొప్పగా నివాళులర్పించినా తక్కువేనని స్పష్టం చేశారు.

1915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles