తెలంగాణ తానేంటో నిరూపించుకుంది: ఈటల

Fri,November 3, 2017 09:49 PM

Telangana proved itself says minister etela rajender

హైదరాబాద్: తెలంగాణ రాకముందు సీమాంధ్ర నేతలు ఎన్నో మాటలన్నరని.. మూడున్నరేళ్లలోనే తెలంగాణ తానేంటో నిరూపించుకుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంథని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈటల రాజేందర్ సమక్షంలో ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యక్తిగత ప్రయోజనాల కంటే వ్యవస్థ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. గతంలో కనీసం మంచినీరు అందించే ప్రయత్నమే జరగలేదన్నారు. పెద్దపెద్ద పట్టాణాలకే కాదు, తెలంగాణలోని గిరిజన గూడేలకు కూడా మంచి నీరు ఇవ్వబోతున్నమన్నారు. రాష్ట్రంలో వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగుతోందని తెలిపారు. గతంలో ఆరు గంటలు కూడా కరెంట్ ఇయ్యని దుస్థితి నెలకొందన్నారు. అర్థరాత్రి కరెంట్ ఇస్తే పాముకాటు, కరెంట్‌షాక్‌తో వేలాది మంది చనిపోయారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను అధిగమించాం. ఎరువులు, రుణాల కోసం రైతులు క్యూలైన్‌లో నిలబడే పరిస్థితి నుంచి విముక్తి కల్పించాం. సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 40 వేల కోట్లు ఖర్చుపెడుతోందని మంత్రి పేర్కొన్నారు.

1666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles