ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

Fri,March 23, 2018 06:23 PM

Telangana Premier League started in LB Stadium

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియంలో ప్రారంభం అయింది. ఈ పోటీలను హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, టీపీఎల్ చైర్మన్ మన్నే గోవర్దన్ రెడ్డి, టీపీఎల్ ఎండీ దేవేందర్ ప్రారంభించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన యువ క్రికెటర్లతో ఏర్పాటు చేసిన 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఏప్రిల్ 1న ఫైనల్స్ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

ప్రారంభ మ్యాచ్ లో రంగారెడ్డి రాయల్స్ జట్టు.. ఖమ్మం కమాండర్స్ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రంగారెడ్డి జట్టు బ్యాట్స్ మెన్ సశ్వంత్ 56 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
2235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles