నంబర్‌వన్ పోలీస్‌గా నిలిపారు: హోంశాఖ మంత్రిTue,November 14, 2017 11:19 PM

నంబర్‌వన్ పోలీస్‌గా నిలిపారు: హోంశాఖ మంత్రి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్ల రాజ్యం వస్తదని, ఉగ్రవాదులు వస్తారని, హైదరాబాద్‌లో ఆంధ్రాప్రాంతంవారిపై దాడులు జరుగుతాయని కొందరు రకరకాలుగా దుష్పప్రచారం చేశారని, వాటన్నంటిని తెలంగాణ పోలీసులు పటా పంచలు చేశారని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలు చేసి పోలీసు శాఖను దేశంలోనే నెంబర్‌గా నిలిపిన ఘనత రాష్ట్ర తొలి డీజీపీ అనురాగ్‌శర్మకు దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మూడున్నర సంవత్సరాలుగా ఎలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రాన్ని శాంతిభద్రతలు కాపాడడంలో మన పోలీసులు విజయవంతమయ్యారన్నారు. మన రాష్ట్ర గ్రేహౌండ్స్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రశంసించారని గుర్తు చేశారు. వినాయక నిమజ్జనం సహా ఎన్నో పండుగలను సంతోషంగా చేసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన షీ టీమ్‌లు విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికొచ్చి అధ్యయనం చేస్తున్నారని నాయిని అన్నారు. ఎక్కడ శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని సామెత ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అదే చేసి చూపుతున్నారన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌కు దేశంలోనే నంబర్‌వన్ సీఎంగా గుర్తింపు వచ్చిందన్నారు. పోలీస్‌శాఖ బలోపేతానికి ఎన్ని నిధులైన ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని నాయిని పేర్కొన్నారు.

509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS