డిగ్గీరాజాపై నిర‌స‌న‌ల వెల్లువ‌

Mon,May 1, 2017 04:59 PM

Telangana people fire on Digvijaya Singh

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి, మాజీ సీఎం దిగ్విజ‌య్‌ సింగ్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ ఫైర్ అయింది. మ‌న‌ పోలీస్ వ్యవస్థ పై డిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ లోని కే.యూ సెంటర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్‌ ఆధ్వ‌ర్యంలో డిగ్గీ రాజా దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.

పోలీస్ నైతిక స్థైర్యం దెబ్బ తినే లా వ్యవహరించడం సరైన విధానం కాదని, గతం లో కూడా భారత సైనికులను కించపరిచే విధంగా వ్యవహరించిన డిగ్గీకి త‌గిన బుద్ది చెప్పాల‌న్నారు. తక్షణమే తెలంగాణ పోలీస్ వ్యవస్థ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల పై కాంగ్రెస్ పెద్ద‌లు స్పందించ‌క పోవ‌డం బాధాకంర‌. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి దిగజారుడు మాటలు మ‌రోసారి చేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

1336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles