మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్...

Tue,May 14, 2019 04:37 PM

telangana mptc and zptc third phase elections polling closed in maoist effected area

హైదరాబాద్: మూడో విడత జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 70.05 శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. మంచిర్యాల, కుమ్రంభీ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పోలింగ్ ముగిసింది. మిగితా జిల్లాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

మూడో విడతలో రాష్ట్రంలోని 27 జిల్లాలో 161 జడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా వీటిలో ఇప్పటికే 30 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమవడంతో మూడో విడతలో 160 జడ్పీటీసీ, 1710 ఎంపీటీసీ స్థానాలకు అధికారులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 160 జడ్పీటీసీ స్థానాలకు బరిలో 741 మంది అభ్యర్థులు.. 1708 ఎంపీటీసీ స్థానాలకు పోటీలో 5,726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలివిడతలో వాయిదాపడిన సిద్దిపేట జిల్లాలోని అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్‌నగర్ ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 27న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.

509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles