రేపే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

Mon,March 11, 2019 12:45 PM

telangana MLC Elections on March 12

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12న(మంగళవారం) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి వి. నరసింహాచార్యులు పేర్క్నొనారు. అసెంబ్లీలోని కమిటీహాల్‌-1లో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

2210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles