తెలంగాణ నీటి పారుదల శాఖకు ప్రతిష్టాత్మక అవార్డు

Fri,January 4, 2019 12:18 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖకు ప్రతిష్టాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు దక్కింది. సాగునీటి వనరుల నిర్వహణలో మెరుగైన పనితీరు ప్రదర్శిస్తూ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు పాటు పడుతున్నందుకు ఈ అవార్డు లభించింది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శ్యాం సుందర్ ఈ అవార్డును అందుకోనున్నారు.

1593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles