‘మైండ్ స్పార్క్‌’కు ఆర్థికశాఖ ఆమోదం

Sat,October 19, 2019 10:31 PM

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు, విద్యార్థుల్లో అభ్యసనస్థాయి ఏ విధంగా ఉన్నదో తెలుసుకునేందుకు ఎంపికచేసిన 200 పాఠశాలల్లో మైండ్ స్పార్క్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీటిలో 100 స్కూళ్లకు అదనంగా కంప్యూటర్లను సమకూర్చేందుకు రూ.8 కోట్లు మంజూరు చేసినట్టు సమాచారం. ఈ నిధులు విడుదలైన వెంటనే మైండ్ స్పార్క్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు.


ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ సహకారాన్ని నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ప్లాన్ (జేపాల్) సంస్థ అందజేయనున్నది. మైండ్ స్పార్క్ కార్యక్రమంలో భాగంగా 100 స్కూళ్లలో కంప్యూటర్లతో డిజిటల్ బోధన, మిగిలిన 100 స్కూళ్లలో సాధారణ బోధన అందించి, ఈ రెండింటిలో ఏది లాభదాయకంగా ఉంటుందన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles