KCR Cabinet: తెలంగాణ కొత్త మంత్రివర్గ ప్రమాణం

Tue,February 19, 2019 11:53 AM

Telangana Ministers take Oath at Rajbhavan

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళ ఉదయం 11:30 గంటలకు రాజ్‌భవన్‌ వేదికగా జరిగింది. పది మంది ఎమ్మెల్యేల చేత గవర్నర్‌ నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. మొదట నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

indra karan reddy
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీష్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొత్త మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత మంత్రులకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి వచ్చే ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించిందీ వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది.
talasani srinivas yadav
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహముద్ అలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
jagadeesh reddy

పాత కొత్తల మేలు కలయిక


తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో పనిచేసిన ఈటల రాజేందర్, జీ జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు సీఎం కేసీఆర్ రెండో దఫా అవకాశం కల్పించారు. నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, సీహెచ్ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి కొత్తవారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఇప్పటివరకు మంత్రిగా పనిచేయలేదు. ఆయన మొదటిసారి మంత్రి అవుతున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నిరంజన్‌రెడ్డి తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా క్యాబినెట్ హోదాలో పనిచేశారు.
etela rajender

కొప్పుల ఈశ్వర్ తెలంగాణ మొదటి అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పనిచేయగా, వేముల ప్రశాంత్‌రెడ్డి మిషన్‌భగీరథ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. వీ శ్రీనివాస్‌గౌడ్‌ను గత ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా సీఎం కేసీఆర్ నియమించారు. అయితే కోర్టు కేసు కారణంగా పార్లమెంటరీ కార్యదర్శి పదవులు రద్దయ్యాయి. దీంతో ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగారు. మల్లారెడ్డి గతంలో ఎంపీగా ఉన్నారు. మొత్తంగా అనుభవజ్ఞులతోపాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి మంత్రులుగా అవకాశం కల్పించారు.
singireddy niranjan reddy
koppula eshwar
errabelli dayakar rao
srinivas goud
vemula prashanth
malla reddy

5218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles