తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

Tue,February 19, 2019 07:28 PM

Telangana ministers portfolios

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ ఉదయం రాజ్‌భవన్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. పది మంది ఎమ్మెల్యేల చేత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో పాటు రాష్ర్ట హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిపి రాష్ర్ట మంత్రుల సంఖ్య 12కు చేరింది. సీఎం కేసీఆర్ వద్ద ఆర్థికశాఖ, ఇరిగేషన్, రెవెన్యూశాఖ, విద్యుత్, మున్సిపల్, ఐటీశాఖలతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ఉన్నాయి. తెలంగాణ మంత్రులు వారికి కేటాయించిన శాఖలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

శాఖలు ఇవే..


1. ఈటల రాజేందర్- వైద్య, ఆరోగ్యశాఖ
2. వేముల ప్రశాంత్ రెడ్డి- రవాణా, రోడ్లు భవనాలు
3. గుంటకండ్ల జగదీష్‌రెడ్డి- విద్యాశాఖ
4. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి- వ్యవసాయశాఖ
5. తలసాని శ్రీనివాస్‌యాదవ్- పశుసంవర్థకశాఖ
6. కొప్పుల ఈశ్వర్- సంక్షేమశాఖ
7. ఎర్రబెల్లి దయాకర్‌రావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్
8. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి- న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం,
9. వి. శ్రీనివాస్‌గౌడ్- ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు
10. చామకూర మల్లారెడ్డి- కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి
11. మహమూద్ అలీ- హోంశాఖ, జైళ్లు, ఫైర్ సర్వీసెస్

11571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles