శరవేగంగా ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్1, స్టేజ్2 పనులు: హరీశ్‌రావుFri,January 12, 2018 05:17 PM
శరవేగంగా ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్1, స్టేజ్2 పనులు: హరీశ్‌రావు

మహబూబాబాద్: జిల్లాలోని కురివిలో మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డిలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ...కాలేశ్వరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వరంగల్, నల్లగొండ జిల్లాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్ 1, స్టేజ్ 2 ద్వారా నీళ్లు అందిస్తాం. కాకతీయ కాలువ ఆధునీకరణకు రూ.440 కోట్లు కేటాయించాం.

కాకతీయ కాల్వ ఆధునీకరణ పూర్తైతే కాళేశ్వరం నుంచి 8 వేల క్యూసెక్కుల నీళ్లు వస్తాయి. వర్షాలు పడినా పడకపోయినా కాళేశ్వరం నుంచి డోర్నకల్‌కు నీళ్లు ఇస్తామన్నారు. పంట పెట్టుబడి పథకం కింద రెండు పంటలకు రూ.8వేలు ఇస్తాం. రైతులు కోరుకున్నట్లే చెక్కుల రూపంలోనే పెట్టుబడి సహాయం అందుతుంది. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రాష్ట్రంలో ఎరువులు, విద్యుత్, విత్తనాల సమస్యే లేదని తెలిపారు.

771
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS