మావోయిస్టు నేతను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు...

Thu,December 6, 2018 07:38 PM

telangana maoist party commander sujatha in police custody

భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల చర్ల ఏరియాలో జిల్లా పోలీసులకు పట్టుబడిన మావోయిస్టు నేత పాల్వంచ మరియు మణుగూరు ఏరియా కమిటీ సెక్రటరీ సుజాతను ఈరోజు జిల్లా పోలీసులు కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు యాక్షన్ టీం లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు గాను మావోయిస్టు నేతను జిల్లా పోలీసులు విచారించనున్నారు.. రేపు జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు,జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మావోయిస్టు యాక్షన్ టీంలను నిర్వీర్యం చేసేందుకు అన్ని రకాలుగా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

1940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS