శాసనమండలి సమావేశాలు ప్రారంభం

Thu,September 27, 2018 11:02 AM

Telangana Legislative Council starts by Swamy Goud

హైదరాబాద్ : శాసనమండలి పదో సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. సమావేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల మండలి సంతాపం వ్యక్తం చేయనుంది. అలాగే కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాద మృతులకు, కేరళ వరదల్లో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేయనున్నారు.

తొమ్మిదో సభ జరిగి ఆరునెలలు గడుస్తున్న క్రమంలో నిబంధనలమేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. శాసనసభ రద్దయిన తర్వాత శాసనమండలి మాత్రమే సమావేశం కావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటినుంచి కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. సంతాపతీర్మానాల తర్వాత సమావేశం నిరవధికంగా వాయిదా పడనున్నట్లు సమాచారం.

753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles