తెలంగాణ రక్తంలోనే విశ్వమానవాళి గురించి ఆలోచించేతత్వం..!

Sun,January 20, 2019 08:08 PM

Telangana Jagruthi International Youth Leadership meeting ends on sunday

హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు విజయవంతంగా ముగియడం పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రక్తంలోనే విశ్వమానవాళి గురించి ఆలోచించేతత్వం ఉందని తెలిపారు. ఇన్ని రోజులు మన తెలంగాణ గురించి ఆలోచించాం. ఈ అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు ద్వారా ప్రపంచం ముందున్న ప్రధాన సవాళ్లు వాటికి పరిష్కార మార్గాలు కనుగొనే కీలక ప్రయత్నం జరిగింది. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి జరగాలంటే యువత అత్యంత కీలకపాత్ర పోషించాలన్నారు.

దాదాపు 110 దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన మేధావులు, ప్రతినిధులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు తెలంగాణ జాగృతి ఏడాది కాలంగా కృషి చేస్తోందన్నారు. ఈ సదస్సులో ఎన్నో అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఎన్నో పరిష్కార మార్గాలు కనుగొనే ప్రయత్నం జరిగింది. పర్యావరణం, యువత, మహిళా సాధికారత వంటి అంశాలపై దేశ విదేశాల ప్రతినిధులు తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రతిదేశంలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో యువత భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంద‌న్నారు.

హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన సదస్సు ముగింపు వేడుకలకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.2178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles