తెలంగాణ అవసరమేందో అణువణువూ తెలుసు: కేసీఆర్Thu,October 12, 2017 07:49 PM
తెలంగాణ అవసరమేందో అణువణువూ తెలుసు: కేసీఆర్

సూర్యాపేట: తెలంగాణలో ఏ ప్రాంతానికి, ఎవరికి ఏ అవసరముందో తనకు అణువణువూ తెలుసని సీఎం కేసీఆర్ తెలిపారు. సూర్యాపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ సాధనను జీవిత లక్ష్యంగా పెట్టుకుని అనేక పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ప్రజలు తమని గెలిపించారని సీఎం అన్నారు.

ఏడాదిన్నరో యాదాద్రి పవర్‌ప్లాంట్ పూర్తి..
నల్లగొండ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లున్న జిల్లా పాత నల్లగొండ జిల్లా. 60 సంవత్సరాల చరిత్రలో జిల్లా నాయకులు చేయని పనిని తాను తలపెట్టినట్లు సీఎం తెలిపారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మొట్టమొదటి ఆల్ట్రా మెగాపవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిర్మాణం నల్లగొండ జిల్లా దామరచర్లలో తలపెట్టినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు.. మరో ఏడాదిన్నరో పనులు పూర్తై ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు సీఎం పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంత అభివృద్ధే మారిపోతుందని వెల్లడించారు.
లక్షమంది ఉత్తమ్‌లు వచ్చినా కాళేశ్వరాన్ని అడ్డుకోలేరు..
లక్షమంది ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అడ్డుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టితీరుతమని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడి లాఠీ దెబ్బలు తిన్నామన్నారు. ఖమ్మం, నల్లగొండలో వేలాది ఎకరాలను ముంచేసి పులిచింతల కట్టిన్రు. పులిచింతల నిర్వాసితులకు ఇచ్చిన నష్టపరిహారం ఎంత అని సీఎం ప్రశ్నించారు? పోతిరెడ్డిపాడుకు అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు నోరు మొదపలేదని దుయ్యబట్టారు. ప్రజల మేలు కోసం కాంగ్రెస్ ఏనాడూ పనిచేయలేదన్నారు. తెలంగాణలో ఎవరికి ఏ అవసరముందో తనకు అణువణువూ తెలుసన్నారు.
మూసీ కాల్వల ఆధునీకరణకు టెండర్లు...
మూసీ కాల్వల ఆధునీకరణకు వెంటనే టెండర్లు పిలుస్తమని సీఎం తెలిపారు. ఆరు నెలల్లో మూసీ కాల్వ ఆధునీకరణ పూర్తి అవుతుందన్నారు. మూసీ ప్రాజెక్టును 365 రోజులు నింపే ఉంచుతామని చెప్పారు. మూసీ నుంచి పానగల్లు వరకు కాల్వ తవ్వొచ్చన్న ఆలోచన గత పాలకులు చేసిన్రా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పూర్తయితే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు నీళ్లొస్తాయి. త్వరలోనే నల్లగొండ రైతులు 3 లక్షల 20 వేల ఎకరాల్లో మీసం మెలేసి రెండు పంటలు పండిస్తారన్నారు.
cm-nlgp
cm-nlgp1

1271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS