దివ్యాంగులకు రూ. 3016 పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ

Tue,December 3, 2019 02:57 PM

వనపర్తి: దివ్యాంగులకు 3,016 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్ర తెలంగాణ అనీ, దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇంత భారీ మొత్తంతో వారికి పెన్షన్ అందడం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు.


దివ్యాంగుల గురించి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన తెలిపారు. వారికి సంబంధించి ఏ పని కూడా ఆగకూడదని సీఎం ఎప్పుడూ అంటుంటారని మంత్రి గుర్తు చేశారు. వైకల్యం జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కాదని దివ్యాంగులు నిత్యం నిరూపిస్తూనే ఉంటారని మంత్రి పేర్కొన్నారు. అంధులకు మనోనేత్రం ఎక్కువగా పని చేస్తుందని పెద్దవారు చెబుతారని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.1064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles