Telangana Intermediate 1st & 2nd Year Results 2019

'సామాజికాభివృద్ధిలో దేశానికే ఆదర్శం తెలంగాణ'

Sat,March 10, 2018 02:56 PM

Telangana is idol to Nation in social justice

హైదరాబాద్: సామాజికాభివృద్ధిలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం పేర్కొంది. బహరైన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు రాదారపు సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. దేశంలో కాలానుగుణంగా చాలామార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరి సామాజికాభివృద్ధి లక్ష్యంగానే రాజకీయాలు సాగాలని అభిలషించారు. ఈ విషయంలో ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం.. మూస విధానాలకు స్వస్తి చెప్పి.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధిపథంలో దూసుకుపోతుందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ విముక్తి పోరాటంలో విజయం సాధించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ వైపు యావత్ దేశం చూస్తుందన్నారు. దేశ రాజకీయాల్లో బలమైన మార్పు కోసం కేసీఆర్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తారనే బలమైన నమ్మకం తమకుందని వెల్లడించారు. సమావేశం సందర్భంగా ఎన్నారైలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ ఉపాధ్యక్షులు బొలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా. రవి, సెక్రెటరీలు రవిపటేల్, గంగాధర్, సుధాకర్, జాయంట్ సెక్రెటరీలు దేవన్న, విజయ్, సుధాకర్, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ రాజేష్, నర్సయ్య, రాజు, రాజేందర్, వెంకటేష్, సాయన్న, వసంత్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

1296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles