మే 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

Thu,April 18, 2019 06:07 PM

Telangana intermediate advanced supplementary from May 14

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 59.08శాతం, ఇంటర్ సెంకండియర్‌లో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షా షెడ్యూల్ రేపు ప్రకటిస్తామని జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో మేడ్చల్ జిల్లా 76శాతంతో ప్రథమస్థానం, 29శాతంతో మెదక్ చివరి స్థానంలో నిలిచాయి. ఇంటర్ సెకండియర్‌లో 76శాతంతో మేడ్చల్ జిల్లా ప్రథమస్థానంలో, 34 శాతంతో మేడ్చల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25వ తేది అఖరుగా నిర్ణయించారు.

2439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles