ఇంటర్‌ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

Thu,April 18, 2019 05:09 PM

Telangana Inter results release by Janardhan reddy

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ర్ట ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్ధన్‌ రెడ్డి విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో బాలికలదే పైచేయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,70,575 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షా ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 29 శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు www.ntnews.com ను లాగినై తెలుసుకోవచ్చు.

4507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles