ఏప్రిల్ 8న తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు!

Tue,March 26, 2019 07:20 AM

Telangana Inter exam results on 8th April 2019

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఈ నెల 30 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. జూన్ 1 నుంచి 2019-20 నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని, వేసవి సెలవుల్లో అడ్మిషన్లు, తరగతులు నిర్వహించే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశాలకోసం ప్రకటన విడుదలచేసిన తర్వాతే.. ప్రవేశాలు కల్పించాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఆన్‌లైన్ అఫిలియేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని, అఫిలియేషన్ పొందిన కాలేజీల జాబితాను వెల్లడిస్తామని, ఆ కాలేజీలకు మాత్రమే ప్రవేశాల యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తామని వివరించారు. అఫిలియేషన్ వివరాలు తెలుసుకోకుండా విద్యార్థులు తొందరపడి ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు పొందవద్దని సూచించారు.
8న ఫలితాలు!
ఇంటర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 8న విడుదలచేసేందుకు బోర్డు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం పనులు దాదాపు ముగిశాయి. ప్రస్తుతం ట్యాబ్లేషన్ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

2182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles