రేపటి నుంచి ఐసెట్ పరీక్షలు

Wed,May 22, 2019 09:21 PM

Telangana ICET exams will be conducted from tomorrow

వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీఎస్ ఐసెట్ పరీక్షలు ఈనెల 23, 24 తేదీల్లో జరుగుతాయని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ రాజేశం తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షకు 49,465 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో 4 సెంటర్లలో జరిగే పరీక్షకు 1954 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ ఉంటుందని, నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని రాజేశం సూచించారు. ఒక నిమిషం నిబంధన అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.

1298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles