‘పచ్చ’ల హారం..రైతన్నకు కనకవర్షం..!

Sat,July 28, 2018 11:55 AM

telangana horticulture support to farmers for fruit planting

హైదరాబాద్ : రాష్ర్టాన్ని హరిత తెలంగాణ మార్చేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే హరితహారం మూడు విడతల్లో కోట్లాది మొక్కలు నాటేలా అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా ఒకవైపు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే మరోవైపు రైతులకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంలో వారికి పండ్లు, ఇతర మొక్కలు సరఫరా చేసి 70 శాతం కాపాడితే మూడేళ్ల నిర్వహణ ఖర్చు చెల్లించనుంది.

ప్రభుత్వ ప్రోత్సాహం..


ఉపాధిహామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకం చేపట్టవచ్చు. రైతులు ఎకరంలో నాటిన మొక్కల్లో 70 శాతం బతికి ఉంటే వాటి సంరక్షణకు మూడేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు, ఎరువుల అందిస్తారు. మొక్కలు నాటేందుకు ఉపాధిహామీ కూలీలతో గుంతలను తవ్వించి మొక్కలను ఉచితంగా అందిస్తారు. ప్రధానంగా మామిడి, నిమ్మ, బత్తాయి, సీతాఫలం, జామా, సపోట, అల్లనేరేడు, చింత, కొబ్బరి, టేకు తోటల పెంపకానికి ప్రభుత్వం చేయూతనిస్తోంది.

దరఖాస్తు చేసుకునే విధానం..


ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. పట్టదారు పాస్ పుస్తకం, ఉపాధిహామీ జాబ్‌కార్డు జిరాక్స్‌లతో ఎంపీడీవో కార్యలయంలోని ఉపాధిహామీ సిబ్బందిని సంప్రదించాలి. మండలస్థాయి అధికారులు దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. ఎప్పుడైన దరఖాస్తు చేసుకునే వీలు ఉంది.

మామిడి..


ఎకరా స్థలంలో 70 మొక్కలు నాటాలి. గుంతల తవ్వకానికి రూ. 952 చెల్లిస్తారు. ఎరువులకు రూ. 1750 చొప్పున రెండుసార్లు అందజేస్తారు. బతికిఉన్న ప్రతీ మొక్కకు 15 రూపాయల చొప్పున నిర్వహణ ఖర్చులు మొదటి ఏడాది రూ. 8450 రూపాయలు, రెండోఏడాది రూ. 12 600 అందిస్తారు.

సపోట..


ఎకరంలో 60 మొక్కలు మాత్రమే నాటాలి. గుంతలు తీయడానికి రూ. 8187 చెల్లిస్తారు. ఎరువుల ఖర్చుల కింద ఏడాదికి రూ. 3 వేల చొప్పున మూడేళ్లకు మొత్తం రూ. 9 వేలు ఇస్తారు. నిర్వహణ కోసం మొదటి ఏడాది రూ. 8100, రెండో ఏట రూ. 10800, మూడో ఏడాది రూ. 10800 ఇస్తారు.


టేకు, జమాయిల్..


ఎకరంలో 160 మొక్కలు నాటాలి. గుంతలు తీయడానికి రూ. 2 వేల 849 చెల్లిస్తారు. నాటినప్పటి నుంచి మొక్కకు రూ. 3.55 చొప్పున చెల్లిస్తారు. మొక్కలకు ఊతకర్రలు కడితే రూపాయి చొప్పున రూ. 160 చెల్లిస్తారు. రవాణా ఖరుల నిమిత్తం మొక్కకు 45 పైసలు అందిస్తారు. నాటిన 160 మొక్కల్లో కనీసం 125 బతికి ఉన్నప్పుడే నిర్వహణ చార్జీలు ఇస్తారు. నిర్వహణ కోసం మొదటి ఏడాది రూ. 7200, రెండో ఏడాది రూ.9600 అందిస్తారు.

నిమ్మ, నారింజ..


ఎకరంలో 110 మొక్కలు మాత్రమే నాటాలి. గుంతలు తీయడానికి రూ. 4437 చెల్లిస్తారు. ఎరువులకు ఏడాదిలో రెండుసార్లు కలిపి రూ. 5500 చొప్పున మూడేళ్లకు మొత్తం రూ. 16500 ఇస్తారు. నిర్వహణ కింద ఒక్కో మొక్కకు నెలకు రూ. 15 చొప్పున మొదటి ఏడాది మొత్తం రూ. 14,850, రెండో ఏడాది రూ. 19800, మూడోసారి రూ. 19800 ఇస్తారు. ఉపాధిహామీ పథకం కింద 300 పనిదినాలు కల్పిస్తారు.

కొబ్బరి...


ఎకరంలో 40 మొక్కలు మాత్రమే నాటాలి. గుంతల కోసం రూ. 5445 చెల్లిస్తారు. ఎరువులకు ఏడాదికి రూ. 2 వేల చొప్పున మూడేళ్లకు మొత్తం రూ.6 వేలు అందిస్తారు. నిర్వహణకు మొదటి ఏడాది రూ. 5400, రెండో ఏడాది రూ. 7200, మూడో ఏట రూ. 7200 చెల్లిస్తారు.

బత్తాయి...


ఎకరంలో వంద మొక్కలు నాటాలి. గుంతలు తీయడానికి 4033 రూపాయలు చెల్లిస్తారు. ఎరువులకు ఏడాదికి రూ. 5 వేల చొప్పున మూడేళ్లు చెల్లిస్తారు. నిర్వహణకు మొదటి ఏడాది రూ. 13500, రెండో ఏడాది రూ. 18 వేలు, మూడో ఏట రూ. 18 వేలు మొత్తం రూ. 74 680 ఇస్తారు.

సీతాఫలం..


ఎకరంలో 160 మొక్కలు నాటాలి. గుంతలు తీసేందుకు రూ. 6453 చెల్లిస్తారు. ఎరువులకు ఏడాదికి రూ. 8 వేల చొప్పున మూడేళ్లకు 24 వేల అందజేస్తారు. నిర్వహణ కోసం మొదటి ఏడాది రూ. 21600, రెండో ఏట రూ. 28800, మూడో ఏడాది రూ. 28800 చెల్లిస్తారు.


చింత..


ఎకరంలో 40 మొక్కలు మాత్రమే నాటాలి. గుంతలు తీయడానికి రూ. 5445 చెల్లిస్తారు. ఎరువులకు ఏడాదికి రూ. రెండు వేల చొప్పున మూడేళ్లకు మొత్తం ఆరు వేలు ఇస్తారు. నిర్వహణకు మొదటి ఏడాది రూ. 5400, రెండో ఏట రూ. 7200, మూడోసారి రూ. 7200 అందిస్తారు.


జామ...


ఎకంరలో 110 మొక్కలు నాటాలి. గుంతలు తీయడానికి రూ. 4437 చెల్లిస్తారు. ఎరువులకు ఏడాదికి రూ. 5500 చొపున చెల్లిస్తారు. నిర్వహణకు మొదటి ఏడాది రూ. 14850, రెండోసారికి రూ. 19800, మూడో ఏడాదికి రూ. 19800 ఇస్తారు.

2003
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles