16న గురుకులాలడిగ్రీ ప్రవేశపరీక్ష

Sat,June 8, 2019 07:25 AM

Telangana Gurukulam degree entrance exam on 16th june 2019

హైదరాబాద్ : ఈ నెల 16న తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లకు మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు రెండో పేపర్ జరుగుతుందని, అభ్యర్థులు జూన్ 12 నుం చి హాల్‌టికెట్లను tgugcet. cgg.gov. in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

1055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles