కేరళకు 500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిన తెలంగాణ

Wed,August 22, 2018 10:35 AM

Telangana Govt to send 500 tonnes of rice to flood hit Kerala

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే రూ.25 కోట్ల నగదు సాయం, రెండున్నర కోట్ల విలువ చేసే నీటిశుద్ధి మిషన్లు, చిన్నారుల కోసం వంద టన్నుల బాలామృతం, 20 టన్నుల పాలపొడిని కేరళకు అందించిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపింది. పీపుల్స్ ప్లాజా నుంచి 18 బియ్యం లారీలు ఇవాళ ఉదయం బయల్దేరాయి. ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్.. పచ్చజెండా ఊపి బియ్యం లారీలను కేరళకు పంపారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేరళలో భయంకరమైన వర్షాలు కురిశాయన్నారు. కేరళ వాసులకు వచ్చిన ఆపద ఎవరికీ రాకూడదని పేర్కొన్నారు. అందరూ మానవత్వం చాటాల్సిన సమయమిది అని ఈటల చెప్పారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలనేదే తమ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ. 25 కోట్లు విరాళమిచ్చారని, తాజాగా 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు విరాళం ఇచ్చాయని ఈటల రాజేందర్ వెల్లడించారు.

2051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles