రైతు బంధు పథకానికి నిధులు విడుదల

Wed,April 11, 2018 01:12 PM

Telangana govt sanctioned funds to Rythu bandhu pathakam


హైదరాబాద్: రైతు బంధు పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఖరీఫ్ సీజన్ కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ప్రభుత్వం త్వరలోనే రైతులకు రైతుబంధు పథకం చెక్కులు పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రైతు బంధు చెక్కుల ముద్రణ ప్రారంభమైన విషయం తెలిసిందే.

పెట్టుబడి చెక్కుల సొమ్ము తీసుకునేందుకు బ్యాంకులకు వచ్చే రైతులను గుర్తించడానికి రాష్ట్రప్రభుత్వం యాప్‌ను సిద్ధం చేస్తున్నది. ఏ బ్యాంకులోనైనా సొమ్ముతీసుకునేలా ఆర్డర్ చెక్కులు ఇస్తుండటంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. గ్రామసభలో చెక్కు అందుకున్న రైతు ఏదైనా బ్యాంకులో సొమ్ము తీసుకోవడానికి వెళ్తే, అతని పాస్‌బుక్ ఖాతా నంబర్‌ను పరిశీలిస్తారు. పాస్‌బుక్ నంబర్‌ను ఈ యాప్‌లో ఎంటర్ చేస్తే రైతు వివరాలన్నీ వస్తాయి. ఆ వివరాలన్నీ పరిశీలించాక వచ్చిన వ్యక్తి నిజమైన రైతు అని తేలాకే డబ్బు చేతికి ఇస్తారు. బా్ంయకులు ముద్రించిన మొదటి విడత చెక్కులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నాయి. వాటిని జిల్లాలకు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి మూడు రోజులపాటు ఆయా బ్యాంకులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వ్యవసాయ శాఖ వర్గాలు వాటిని స్వీకరిస్తాయి. మూడు రోజులపాటు పరిశీలన అనంతరం వాటిని ఆయా జిల్లాల నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులకు కట్టుదిట్టమైన భద్రత నడుమ అప్పగిస్తారు.

5738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles