కేరళకు 500 టన్నుల బియ్యం: సీఎం కేసీఆర్

Mon,August 20, 2018 07:16 PM

Telangana Government to send 500 tonnes rice to kerala

హైదరాబాద్: జల ప్రళయంలో చిక్కుకున్న కేరళ బాధితులను ఆదుకునేందుకు 500 టన్నుల బియ్యం పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం సరఫరా చేయడానికి బియ్యం పంపాలని కేరళ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ ఎస్‌కే జోషి, సివిల్ సైప్లె కార్పొరేషన్ కమిషనర్ అకున్ సబర్వాల్‌తో మాట్లాడిన సీఎం..వెంటనే కేరళకు 500 టన్నుల బియ్యం పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేరళకు బియ్యం పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు కేరళ సీఎం సహాయనిధికి అందజేసిన విషయం తెలిసిందే.






3946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles