జూన్ రెండోతేదీన ప్రభుత్వ ఇఫ్తార్ విందు

Thu,May 30, 2019 06:25 AM

Telangana government to host iftar at 800 mosques

హైదరాబాద్ : రంజాన్ పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ జూన్ రెండోతేదీన ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఒకరోజు ముందే పూర్తిచేయాలని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లను మైనార్టీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో వేదిక, నమాజ్ చేయడానికి ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రొటోకాల్, ఆహ్వాన పత్రికల పంపిణీ, శానిటేషన్, తాగునీరు, లైటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్‌సింగ్, అడిషనల్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ డీఎస్ చౌహాన్, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వహీద్, మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, సమాచారశాఖ అ దనపు డైరెక్టర్ నాగయ్య కాంబ్లే పాల్గొన్నారు.

1679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles