కోళ్ల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం

Sun,July 16, 2017 09:30 AM

telangana Government promotion country chicken poultry farming

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కోళ్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు పౌష్టికాహార లోపం నుంచి నివారించేందుకు సబ్సిడీపై కోడిపిల్లలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఓ వైపు గ్రామీణ ప్రాంతాలలోని గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణీ చేస్తున్నది. వారి ఆర్థికాభివృద్ధి కోసం 75శాతం సబ్సిడీతో అందిస్తూ వారి ఉన్నతికి నిధులు కేటాయించి మొదటి విడతలో గొర్రెలను సైతం పంపిణీ చేసింది.

అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు సబ్సిడీపై కోళ్లను అందించేందుకు 2016-17కు గాను యూనిట్లను మంజూరు చేసింది. ఎప్పటి నుంచో పౌల్ట్రీ కోళ్ల కంటే నాటు కోళ్లకు అధిక డిమాండ్ ఉంటుంది. ఒక్కో నాటు కోడి ధర రూ.300 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. ఉన్న డిమండ్ మేరకు గ్రామీణ ప్రాంతాలలో నాటుకోళ్ల ద్వారా ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిధులను కేటాయించి సబ్సిడీపై కోడిపిల్లలను అందిస్తుంది.

జిల్లాకు కేటాయించిన యూనిట్లలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ఆధారంగా యూనిట్లను పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్‌లో 45 కోడిపిల్లలు ఉంటాయి. ఒక్కో కోడిపిల్ల కొనుగోలుకు రూ.68లు ఖర్చు అవుతాయి. దానిలో ప్రభుత్వం రూ.50 సబ్సిడీగా చెల్లిస్తుంది. రైతు తన వాటాగా రూ.18 చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో యూనిట్‌లో ఉండే 45 కోడిపిల్లలకు విలువ రూ.4560 ప్రభుత్వం వాటిలో నుంచి రూ.3750 చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో రైతులు కేవలం రూ.810లు చెల్లించాలి.

రైతులకు అందించే కోడిపిల్లలు గ్రామీణ ప్రాంతాలలో ఉండే నాటు కోడిపిల్లలు నాలుగువారాల వయస్సు వాటిని పంపిణీ చేస్తారు. వీటిని తమ ఇంటి పరిసరాల్లో పెంచుకునేందుకు వీలు ఉంటుంది. పౌల్ట్రీ కోళ్లను పెంచాలంటే దానికి షెడ్డు, వాటికి కావలసిన దాణా, నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. దానికి భారీగా ఖర్చు అవుతుంది. కానీ నాటు కోళ్ల పెంపకానికి ఎలాంటి ఖర్చు లేకుండానే తమ పెరట్లో పెంచుకోవచ్చు. డబ్బు ఆదాతో పాటుగా రైతుకు ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన పని ఉండదు. ఒక్కో కోడి పెరిగిన తరువాత 5 కేజీల వరకు మాంసం వస్తుంది. దీని ద్వారా రైతులు విక్రయించుకుని లాభం గడించవచ్చు.

అదేకాకుండా తాము కూడా తినేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కోళ్లు సంవత్సరానికి 150 నుంచి 200 గుడ్లను పెడతాయి. ఈ గుడ్లలో ఎక్కుగా ప్రోటీన్లు కలిగి ఉండి పిల్లలు, మహిళలకు పౌష్టికాహారం అందుతుంది. ఇదే కాకుండా స్వయం ఉపాధికి చక్కటి మార్గం. జిల్లాలో ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో ఉండే పశువైద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే దానిని జిల్లా కేంద్రంలోని పశుసంవర్థకశాఖ జేడీ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ దరఖాస్తుదారుడు పంపించిన దరఖాస్తును పరిశీలించి కలెక్టర్ ఆమోదంతో లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేస్తారు.

9656
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS