తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ పాట‌.. వీడియో

Thu,June 1, 2017 03:12 PM

Telangana Formation Day Song 2017


రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే.. ప‌డి లేచి నిలిచే ర‌ణ‌ములో నాతెలంగాణా.. లేచి నిలిచి గెలిచే ర‌ణ‌ములో... ప‌ల్లె మ‌ట్టి వాస‌న‌లే.. స్వ‌చ్ఛ‌మైన మనుషులే.. అంద‌మైన భూమి జ‌గ‌ములో నాతెలంగాణా.. బంగారు భూమి జ‌గ‌ములో....అంటూ తెలంగాణ కీర్తి, గొప్ప‌త‌నం, సంస్కృతి, భాష‌, యాస గురించి ఈ పాట‌లో ఎంతో అందంగా చెప్పారు. కొట్లాట నేర్పిన నేల తెలంగాణ, సిరులు పండే మాగాణి, చెరువుల మిల‌మిల మెరుపు, ప‌క్షుల కిల‌కిల అరుపు అంటూ మ‌న తెలంగాణ గొప్ప‌త‌నం, ఖ్యాతిని గురించి ఎంత గొప్ప‌గా చెప్పారో... చూస్తూ.. విని ఎంజాయ్ చేయండి.. జైతెలంగాణ‌.. జైజై తెలంగాణ‌

రాజ‌స్థాన్‌కు చెందిన భ‌న్వ‌రి దేవి పాడిన పాట‌కు స్ఫూర్తి పొంది ఈ పాట ట్యూన్ స‌మ‌కూర్చారు.
లిరిక్స్ : క‌ందికొండ‌
సంగీతం : న‌ంద‌న్ బొబ్బిలి
గానం : మ‌ంగ్లీ(స‌త్య‌వ‌తి)
ర్యాప్ : లిప్సిక‌
ద‌ర్శ‌క‌త్వం : దాము కొస‌న‌మ్‌11547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS