'పంచాయతీ' ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Mon,January 21, 2019 08:25 AM

హైదరాబాద్: తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ విధానంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఫలితాల అనంతరం అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.


భోజనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడిస్తారు. తర్వాత వెనువెంటనే వార్డు సభ్యుల్లోంచి ఒకరిని ఉప సర్పంచిగా ఎన్నకుంటారు. అభ్యర్థులు, ఓటర్లు ఎవరు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు.

1501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles