బీడీఎస్ సీట్ల భర్తీకి ఫైనల్ నోటిఫికేషన్ విడుదల

Fri,September 7, 2018 06:53 PM

Telangana Final notification for BDS seat admissions 2018

రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లోని బీడీఎస్ కోర్సులో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీనారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు వైద్య కళాశాలల్లోని బీ ,సీ (ఎన్‌ఆర్‌ఐ) కేటగిరి సీట్లను ఈ మాప్ అప్ రౌండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ నెల 10వ తేదీన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి దూర విద్య కేంద్రం (పిజిఆర్ఆర్ సిడిఈ), ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హైదరాబాద్‌ లో కౌన్సెలింగ్‌ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మొదటి ర్యాంక్ నుండి చివరి ర్యాంక్ వరకు కేటగిరి బీ,సీ (ఎన్‌ఆర్‌ఐ) కోటా సీట్లకు అర్హులైన అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కొరకు www.knruhs.in వెబ్ సైట్ ను చూడవచ్చని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలోతెలిపారు.

3302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles