దిగ్విజ‌య్ వ్యాఖ్యలను తప్పుపట్టిన తెలంగాణ డీజీపీ

Mon,May 1, 2017 03:34 PM

Telangana DGP Anurag Sharma dismisses  Digvijaya Singh allegations

హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ తెలంగాణ పోలీసుల‌పై చేసిన వ్యాఖ్య‌లను రాష్ట్ర డీజేపీ అనురాగ్ శ‌ర్మ తీవ్రంగా తప్పుపట్టారు. దిగ్విజ‌య్ నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌న్నారు. ముస్లిం యువ‌కుల‌ను రెచ్చ‌గొట్టేందుకు తెలంగాణ పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ పేరుతో ఓ బోగ‌స్ వెబ్‌సైట్‌ను నిర్వ‌హిస్తున్నార‌ని దిగ్విజ‌య్ ఆరోప‌ణ చేశారు. ఆ వెబ్‌సైట్ కార‌ణంగానే ముస్లిం యువ‌త ఐఎస్ఐఎస్ మాడ్యూల్‌కు ఆక‌ర్షితుల‌వుతున్నార‌ని ఆరోపించారు. దిగ్విజ‌య్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను తెలంగాణ డీజీపీ కొట్టిపారేశారు. బాధ్య‌తాయుత‌మైన సీనియ‌ర్ నేత నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం వ‌ల్ల పోలీసుల నైతిక‌త దెబ్బ‌తింటుద‌ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శ‌ర్మ ట్వీట్ చేశారు. దేశ‌వ్య‌తిరేక శ‌క్తులతో నిత్యం యుద్ధం చేస్తున్న పోలీసుల ఇమేజ్‌ను దెబ్బ‌తీస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా కాంగ్రెస్ నేత వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న‌ది. దిగ్విజ‌య్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
1853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles