జోడెడ్ల బండిలా సంక్షేమం, అభివృద్ధి

Fri,November 16, 2018 04:45 PM

telangana developed in TRS Govt says MLC Palla Rajeshwar reddy

మహబూబాబాద్ : టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధిని సీఎం కేసీఆర్ జోడెడ్ల బండిలాగా ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసముద్రం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సంక్షేమం కోసం రూ. 43 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అన్నమో రామచంద్ర అనే అరుపులు సీఎం కేసీఆర్ పాలనలో ఎక్కడా వినపడడం లేదన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణ బిడ్డకే దక్కాలనే ఉద్దేశంతో కేసీఆర్.. జోన్ల విభజన చేశారు. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని గుర్తు చేశారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా గ్రామీణ యువతకు బ్యాంక్‌కు సంబంధం లేకుండా సహాయము చేస్తున్నాము. ఇప్పటికే రూ. 800 కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు.

కాలువలు తీశారు తప్ప ప్రాజెక్టులు కట్టలేదు
కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగంలో కాలువలు తీశారు తప్ప.. ప్రాజెక్టులు కట్టలేదని మండిపడ్డారు. కాళేశ్వరం మీద వందల కేసులు వేసినా కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే గెలిచిందన్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని అడ్డుపడ్డ ప్రతిపక్షాలు ఏ రాష్ట్రంలో లేరు. కానీ తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ధ్వజమెత్తారు. చీరలు, నీళ్లు, ప్రాజెక్టులు, రైతుబంధు చెక్కులను కూడా ప్రతిపక్షాలు ఆపాయని గుర్తు చేశారు. 17.17 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.

1046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles