రుణమాఫీ కోసం 6వేల కోట్లు కేటాయింపు: సీఎం కేసీఆర్

Mon,September 9, 2019 12:16 PM

హైదరాబాద్: ''తీవ్రమైన ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై ప్రభావం చూపింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా ఉంది. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని'' సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. 'వ్యవసాయ రంగంలో తెలంగాణ సుసంపన్నమైంది. తెలంగాణ సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 5.8శాతం వృద్ధి సాధించాం. పరిశ్రమలో 5.8శాతం వృద్ధి నమోదు చేశాం. ఐటీ ఎగుమతుల విలువ రూ.1,10,000 కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి తగ్గింది. మాంద్యం కారణంగా ఆదాయం తగ్గినా పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయ వనరులను బట్టి ప్రాధాన్యతలను మారుస్తూ ఉంటాం. మాంద్యం ఉన్నా వ్యవసాయం, సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు, 18 నెలలుగా ఆర్థిక మాంద్యం స్థిరంగా కొనసాగుతోంది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మిషన్ భగీరథతో నీటి సమస్యను పరిష్కరించాం. మాంద్యం ఉన్నా వ్యవసాయం, సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని' ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


'రైతుబంధు, రైతుబీమా పథకాలు నిరంతరం కొనసాగుతుంది. పంట రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నాం. రైతుబంధు కోసం 12వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నాం. రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137కోట్లు కేటాయింపులు చేస్తున్నాం. ఆసరా పెన్షన్ల కోసం రూ.9402 కోట్లు కేటాయింపు. కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయి అందలేదు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందిన నిధులు రూ.31,802కోట్లు మాత్రమే. 1,03,551 కోట్ల రూపాయల మూలధన వ్యయం పెరిగింది. పెట్టుబడి వ్యయం ఆరురెట్లు పెరిగిందని' సీఎం వివరించారు.

1575
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles