అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై సీఎస్ ఎస్కే జోషి సమీక్ష

Thu,May 16, 2019 06:45 PM

telangana chief secretary meeting on urban forest parks development

హైదరాబాద్: అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై సీఎస్ ఎస్కే జోషి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న 59 పార్కుల పురోగతిపై ఏడు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంత ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తోందన్నారు. వీటిని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా సంబంధిత శాఖలు పనిచేయాలన్నారు. వరుస ఎన్నికల వల్ల పనుల్లో జాప్యం జరిగినా వచ్చే నవంబర్ నెలాఖరు కల్లా పార్కుల పనులను పూర్తి చేయాలని సీఎస్ అదేశించారు.

459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles