పోలింగ్ బూత్‌కు 5 గంటల వరకు చేరుకోవచ్చు: రజత్ కుమార్

Thu,December 6, 2018 06:17 PM

telangana chief electoral officer press meet ahead of telangana elections

హైదరాబాద్: రాష్ట్రంలో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సచివాలయం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలయినటువంటి 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఓటేసేవాళ్లు సాయంత్రం 4 వరకు పోలింగ్ బూత్‌కు చేరుకోవాలన్నారు. 4 వరకు క్యూలో నిలుచున్న వాళ్లకు ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తామని.. 4 తర్వాత పోలింగ్ బూత్‌కు వచ్చేవాళ్లను ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించరని ఆయన తెలిపారు. మిగితా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్‌కు వెళ్లేవాళ్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 5 దాటిన తర్వాత పోలింగ్ బూత్‌కు చేరుకునేవాళ్లను ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించరని రజత్ స్పష్టం చేశారు.

సీ-విజిల్ యాప్‌కు స్పందన బాగుంది..
తెలంగాణలో సీ-విజిల్ యాప్‌కు స్పందన బాగుందన్న రజత్.. సీవిజిల్ యాప్ ద్వారా మొత్తం 8 వేల ఫిర్యాదులు అందాయన్నారు. వాటిలో ఇప్పటి వరకు 90 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ రోజు కూడా సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

2943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles