బ్లాక్‌చైన్‌తో చిట్‌ఫండ్ల మోసాలకు చెక్

Thu,March 21, 2019 06:40 AM

Telangana check chit fund sandals with black chain system

హైదరాబాద్ : చిట్‌ఫండ్ కంపెనీలు ఖాతాదారులను మోసం చేయకుండా ఉండేందుకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ బ్లాక్‌చైన్ టెక్నాలజీని వాడటం ప్రారంభించింది. చిట్‌మాంక్ అనే సంస్థ.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ సేవలను అందిస్తున్నది. ఖాతాదారులు మోసపోకుండా ఉండేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. స్థిరాస్తుల తనఖా చెల్లదని స్పష్టంచేసింది. రాష్ట్రంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ వాడుతూ చిట్‌ఫండ్ల వ్యాపారం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడం పట్ల నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ (నాస్కాం) ప్రశంసించింది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేలకుపైగా రిజిస్టర్డ్ చిట్‌ఫండ్ సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా వందల కోట్ల వ్యాపారం జరుగుతున్నది. వాస్తవానికి చిట్‌ఫండ్ కంపెనీలు చిట్‌ఫండ్ చట్టం 1992 సెక్షన్ 20 కింద చిట్టి విలువకు సమానమైన మొత్తాన్ని చిట్ రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలి. అయితే పలు సంస్థలు నియమ నిబంధనలు పాటించకుండా ఖాతాదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కొన్ని కంపెనీలు ఖాతాదారుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి బిచాణా ఎత్తివేస్తుండటంతో ప్రజలు రోడ్డుపైకి వస్తున్నారు. చిట్‌ఫండ్ కంపెనీల వివరాలను కంప్యూటరీకరణ చేసి వాటి గురించిన పూర్తిసమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచాలని నిర్ణయించారు.

ఈ సమాచారాన్ని తొలగించడానికి, ట్యాంపర్ చేయడానికి వీలులేకుండా ఉంచేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతున్నది. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఏ చిట్‌ఫండ్ కంపెనీని ఎంచుకోవాలి? ఎలా మోసం చేస్తున్నాయి? ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలు ఖాతాదారులకు వివరంగా తెలుస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ టీ చిరంజీవులు తెలిపారు. ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్లశాఖ బ్లాక్‌చైన్ టెక్నాలజీని వాడటం పట్ల నాస్కాం ప్రశంసించి, ఇది మంచి పరిణామమని పేర్కొన్నది.

856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles