మరికాసేపట్లో మంత్రుల ప్రమాణస్వీకారం

Tue,February 19, 2019 10:58 AM

telangana cabinet take oath will soon

హైదరాబాద్‌ : మరికాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరంతా ఇప్పటికే రాజ్‌భవన్‌ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజా మంత్రివర్గ విస్తరణలో పదిమందికి చోటు కల్పించారు. వీరిలో గతంలో మంత్రులుగా పని చేసిన ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డితో పాటు కొత్తగా సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వీ. శ్రీనివాస్‌ గౌడ్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉన్నారు. గవర్నర్‌ నరసింహన్‌.. పది మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు. ఇక పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్‌భవన్‌కు చేరుకోవడంతో అక్కడ సందడిగా మారింది.

1255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles