తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు

Mon,January 7, 2019 12:52 PM

Telangana Cabinet meeting decisions

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడి నియామకానికి తీర్మాణం చేశారు. ఆంగ్లో ఇండియన్ సభ్యుడిగా స్టిఫెన్‌సన్‌ను నియమించాలని నిర్ణయించారు. స్టిఫెన్‌సన్‌ను నియమిస్తూ మంత్రివర్గం గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపాదన పంపింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు, ప్రభుత్వ యంత్రంగానికి మంత్రి వర్గం అభినందనలు తెలిపింది. ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ సభ్యుడి ప్రమాణ స్వీకారం జరపాలని నిర్ణయించారు. సభ్యులకు రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనల ప్రతులు, నిబంధన పుస్తకాలు, బుక్‌లెట్లు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. సభ్యులకు అందించే ప్రతులను సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ కార్యదర్శి చూపించారు.

6504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles