బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

Sat,September 14, 2019 10:02 AM

telangana budget sessions start

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 9వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ ముగిసిన అనంతరం బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుంది. ఈ సమావేశాలు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

ఆశ్రమ పాఠశాలలు, ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జీహెచ్‌ఎంసీలో మురుగునీటి శుద్ధికేంద్రాల సామ ర్థ్యం పెంపు, సంచార పశువైద్యశాలలు, హైదరాబాద్‌లో ఐదురూపాయల భోజనకేంద్రాల పెంపు, గొర్రె పాకల మంజూరు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనం, వ్యవసాయ వాహనాలపై పన్ను మినహాయింపు, కల్యాణలక్ష్మి పథకాలపై సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనున్నది. అనంతరం జీరో అవర్ ఉంటుంది. ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రులు చెరుకు ముత్యంరెడ్డి, ముఖేశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సోమగోపాల్‌కు సభ సంతాపం తెలుపనున్నది. అనంతరం బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది. బడ్జెట్‌పై అన్ని పక్షాలసభ్యులు ప్రసంగించే అవకాశముంది. టీఆర్‌ఎస్ నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి ప్రసంగిస్తారని తెలుస్తున్నది. బడ్జెట్‌పై చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమాధానమిస్తారు.

485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles