తెలంగాణ బడ్జెట్‌ కేటాయింపులు.. అత్యధికంగా నీటి పారుదల శాఖకు

Fri,February 22, 2019 01:33 PM

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12:07 గంటలకు ప్రారంభమైన బడ్జెట్‌ ప్రసంగం 1:07 గంటలకు ముగిసింది. గంటపాటు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివి వినిపించారు. రైతులు, వ్యవసాయంపై ప్రధానంగా దృష్టిసారిస్తూ సంక్షేమంతోపాటు ఇతర రంగాలకు సమతూకంగా నిధులను కేటాయించారు. నీటి పారుదల శాఖకు అత్యధికంగా రూ. 22,500 కోట్లు కేటాయించారు. మిషన్ కాకతీయ పథకం నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తుంది. చరిత్రలోనే మొదటిసారిగా రాష్ర్ట బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు కేటాయించారు.


-2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
-రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు
-మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు
-రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు
-ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా

-రైతు రుణమాఫీ - రూ. 6 వేల కోట్లు
-రైతుబంధు - రూ. 12 వేల కోట్లు
-రైతు బీమా - రూ. 650 కోట్లు

-వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు
-నీటి పారుదల శాఖకు రూ. 22,500 కోట్లు
-విద్యుత్‌ శాఖకు రూ. 4,006 కోట్లు

-పౌరసరఫరాల శాఖకు రూ. 1,835 కోట్లు
-గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 10,716 కోట్లు
-పంచాయతీరాజ్‌ శాఖకు రూ. 8,443 కోట్లు
-వైద్యారోగ్య శాఖకు రూ. 5,536 కోట్లు

-ఆసరా పెన్షన్లు - రూ. 12,067 కోట్లు
-ఈఎన్టీ, దంత పరీక్షల కోసం రూ. 5,536 కోట్లు
-బియ్యం సబ్సిడీలకు రూ. 2,744 కోట్లు
-కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కోసం రూ. 1450 కోట్లు
-నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు

-ఎస్సీల అభివృద్ధి కోసం రూ. 16,581 కోట్లు
-ఎస్టీల అభివృద్ధి కోసం రూ. 9,827 కోట్లు
-మైనార్టీ సంక్షేమానికి రూ. 2004 కోట్లు
-ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు

-సాంఘిక సంక్షేమం -రూ. 14,005 కోట్లు
-గిరిజన సంక్షేమం - రూ. 8,970 కోట్లు
-బీసీ సంక్షేమం - రూ. 4,528 కోట్లు
-మహిళా సంక్షేమం - రూ. 1,628 కోట్లు

4188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles