Telangana Budget Highlights: రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

Fri,February 22, 2019 12:16 PM

Telangana Budget 2019 live updates

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్థిక మంత్రిగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్‌ చదివి వినిపిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. రాష్ర్టం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగున్నరేళ్లలో అద్భుత విజయాలు సాధించాం. అత్యధికంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ర్టంగా తెలంగాణ రికార్డు సృష్టించింది.

-నిరుపేదలకు గృహ నిర్మాణ పథకంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
-డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకం కింద ఇప్పటి వరకు 2,72,763 ఇళ్లను మంజూరు చేశాం.
-ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

-340 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తాం.
-ప్రస్తుతమున్న రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని నిర్ణయించాం.

-విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.
-ప్రతీ పదివేల మందికి ఒక బస్తీ దవఖానా ఏర్పాటు చేస్తాం.
-పేదలకు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రుల్లో వసతులన్ని మెరుగుపరిచాం.
-ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు కోసం నిధుల్ని మూడింతలు పెంచాం.
-అత్యుత్తమ వైద్య సేవలందించే మూడు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని కేంద్రం ఇటీవలే ప్రకటించింది.

-వచ్చే సంవత్సరం నుంచి బీసీల కోసం మరో 119 గురుకులాలు ప్రారంభం.
-గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై సగటున లక్ష రూపాయాలు వెచ్చిస్తున్నాం.

-విద్యుత్‌ సంక్షోభాన్ని తెలంగాణ చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది.
-మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది.
-దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది.
-తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
-విద్యుత్‌ వినియోగం వృద్ధి రేటులో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం గర్వకారణం.

-ఏప్రిల్‌ చివరినాటికి మిషన్‌ భగీరథ పనుల్ని వందశాతం పూర్తి చేస్తాం.
-మరో రెండు నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తాం.

-2019-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ. 94,776 కోట్లు
-2019-20లో కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనా రూ. 22,835 కోట్లు
-2019-20లో ప్రగతి పద్దు రూ. 1,07,302 కోట్లు
-నిర్వహణ పద్దు రూ. 74,715 కోట్లు

-పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ. 3,256 కోట్లు
-ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు
-500 జనాభా కలిగిన గ్రామానికి రూ. 8 లక్షల నిధులు

-టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ. 1.41 లక్షల కోట్ల పెట్టుబడులు
-టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు
-పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయి

-వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు
-నీటిపారుదల శాఖకు రూ. 22,500 కోట్లు
-ఈఎన్టీ, దంత పరీక్షల కోసం రూ. 5,536 కోట్లు

-రైతుబంధు కోసం రూ. 12 వేల కోట్లు
-రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లు
-రైతు బీమా కోసం రూ. 650 కోట్లు
-2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న రూ. లక్ష వరకు పంట రుణాలు మాఫీ

-బియ్యం రాయితీ కోసం రూ. 2,744 కోట్లు
-ఎంబీసీ కార్పొరేషన్ కోసం రూ. వెయ్యి కోట్లు
-షెడ్యూల్ తెగల ప్రగతి నిధి కోసం రూ. 9,827 కోట్లు
-షెడ్యూలు కులాల ప్రగతి నిధి కోసం రూ. 16,581 కోట్లు
-మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2004 కోట్లు

-కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 1450 కోట్లు
-నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు
-ఆసరా పింఛన్ల కోసం రూ. 12,067 కోట్లు

-2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 10.4 శాతం
-2017-18లో మొత్తం వ్యయం రూ. 1,43,133 కోట్లు
-2017-18లో రెవెన్యూ మిగులు రూ. 3,459 కోట్లు
-2018-19 సంవరించిన అంచనా వ్యయం రూ. 1,61,857 కోట్లు

-2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
-రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు
-మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు
-రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు
-ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా

-2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 10.6 శాతంగా నమోదైంది.

-గతంలో గుజరాత్, కేరళ అభివృద్ధి నమూనాల గురించే చర్చ జరిగేది. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

-తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. విద్యుత్ సమస్యలు పరిష్కరించి చీకటి నుంచి వెలుగుల వైపు పయనించాం. రాష్ర్టంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. తెలంగాణలో అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైంది.

3107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles