అంతర్జాతీయ స్థాయి చెస్‌ పోటీలకు తెలంగాణ బాలుడు

Mon,May 20, 2019 10:51 PM

telangana boy selected for international chess championship in America

అమెరికాలో పోటీలకు భారతదేశం నుంచి ఒకే ఒక్కడు
ఖమ్మం: అంతర్జాతీయ స్థాయి చెస్‌పోటీలకు భారతదేశం నుంచి తెలంగాణ బాలుడు ఎంపికయ్యాడు. ప్రపంచస్థాయి ఓపెన్ కేటగిరిలో తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన రఘురాంరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఈ నెల 23 నుంచి 27వరకు అమెరికాలోని చికాగో రాష్ట్రంలో జరిగే పోటీలకు ఓపెన్‌ కేటగిరిలో పదేళ్ల వయస్సు ఉన్న 5వ తరగతి విద్యార్థి శీలం రఘురాంరెడ్డి ఎంపికైనట్లు తల్లిదండ్రులు శీలం నరేంద్రరెడ్డి, స్వప్నలు తెలిపారు.

ఇప్పటికే అంతర్జాతీయస్థాయిలో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్న రఘురాంరెడ్డి తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ క్రీడాకారుడిగా ప్రతిభ కనబరుస్తున్నాడు. ఇటీవల శ్రీలంక, అబూదాబిలో జరిగిన పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచాడు. అమెరికాలోని చికాగోలో వరల్డ్‌ ఓపెన్ కేటగిరి చెస్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు రఘురాంరెడ్డి ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రఘురాంరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటి తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నానంటున్నాడు.

1170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles