టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

Mon,July 22, 2019 06:49 PM

Telangana bonalu celebrations in tanzania


తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాలు. ఆషాడం మాసం వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఇక హైదరాబాద్ లో అయితే నెల రోజులు పాటు ప్రతి ఆదివారం ఏదో ఒకచోట(సికింద్రాబాద్, లాల్ దర్వాజ) ఈ బోనాల పండగ అంగరంగవైభవంగా జరుగుతుంది. తెలంగాణ బోనాల సంస్కృతి విదేశాల్లో కూడా కొనసాగుతోంది. ఖండాంతరాలు దాటిన తెలంగాణ బోనాలు ఆఫ్రికాలో మరింత వైభవంగా జరిగాయి. 


టాంజానియాలో స్థిరపడిన తెలంగాణ కుటుంబాలు తమ సంస్కృతికి  ప్రతీకగా నిలిచే బోనాల జాతరను ఘనంగా జరుపుకున్నారు.  దార్ ఎస్ సలాం నగరంలోని సముద్ర తీరంలో ఈ  బోనాల సంబరాలు అంగరాన్నంటాయి. తెలంగాణ సాంస్కృతిక సంఘం టాంజానియా ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. 
ఈ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణకు చెందిన వారంతా ఓ కుటుంబంలా కలిసి మెలిసి ఆనందంగా గడిపారు. బోనాలతోపాటు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారుల ఆటా, పాటలతో, ప్రత్యేకమైన బోనాల పాటలతో ఎంతో సందడిగా వేడుకలు జరిగాయి.

తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ)చైర్మన్ పిట్టల సత్యనారాయణ, వైస్ చైర్మన్ నందకిషోర్ బొల్లక్‌పల్లి, సలహా కమిటీ సభ్యులు వంగా నరసింహరెడ్డి, భాస్కర్ రెడ్డి, పట్లోల్లా సంతోష్ రెడ్డి. కార్యదర్శి కమ్ కోశాధికారి శ్రీనివాస్ సిరిపురం, సాంస్కృతిక కార్యదర్శి జల్లా నాగరాజు బాధ్యతను స్వీకరించి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు ప్రశంసలందుకున్నారు.


1060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles