ఆయుష్ మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Sun,September 2, 2018 10:25 PM

Telangana Ayush admission process begins

వరంగల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మెడికల్ సీట్ల భర్తీ కోసం వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2018-2019 విద్యా సంవత్సరానికి ఆయుష్ కళాశాలల్లో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయుఎంఎస్, బీఎన్‌వైసీ కోర్సుల్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. కేటగిరీ ఏ సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు కోరుతున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ దేవులపల్లి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి సమాచారానికి యూనివర్సీటీ వెబ్‌సైట్ www.knruhs.in చూడాలని ఆయన పేర్కొన్నారు.

1313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles