తెలంగాణ ప్రజలకు, ప్రకృతికి అవినాభావ సంబంధం..

Tue,August 14, 2018 07:10 PM

Telangana Assembly speaker Madhusudana Chary says about haritha haram

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ప్రజలకు, ప్రకృతికీ మధ్య అవినాభావ సంబంధం ఉందని, అందువల్లే వనదేవతలను కొలుస్తామని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పాండవుల గుట్టలో అటవీశాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా స్పీకర్ మధుసూదనాచారి‌, జిల్లా కలెక్టర్ అమేయ కుమార్, డీఎఫ్‌వో రవికిరణ్, విద్యార్థులు మొక్కలు నాటారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ..తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

గతేడాది భూపాలపల్లిలో 40 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా, లక్ష్యాన్ని అధిగమించి 55 లక్షల మొక్కలు నాటామని స్పీకర్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 17 లక్షల మొక్కలు వివిధ ప్రాంతాల్లో నాటారన్నారు. గతంలో విచక్షణారహితంగా చెట్లను నరకడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూపాలపల్లిలో ఎక్కువ శాతం అడవులు ఉండడం వల్ల వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో హరితహారాన్ని విజయవంతం చేసి వర్షాభావ పరిస్థితుల నుండి భవిష్యత్‌ తరాలను కాపాడాలని కోరారు. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పంతో హరితహారం కార్యక్రమం మొదలుపెట్టారని, అందరూ కలిసికట్టుగా విజయవంతం చెయ్యాలని స్పీకర్ పిలుపునిచ్చారు.

2115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles